Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
క్రీడాపోటీల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని గార్ల బయ్యారం సీఐ తిరుపతి కోరారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మండలం లోని మర్రిగూడెం మిని స్టేడియంలో మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించగా విజేతలకు ఎంపీపీ మూడ్ శివాజీ చౌహన్, జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ లక్ష్మీలతో కలిసి సీఐ తిరుపతి, ఎస్సై బాదావత్ రవి నాయక్ గురువారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వాలీబాల్లో ప్రథమ బహుమతిని జీవంచిపల్లి, ద్వితీయ బహుమతిని నగరం జట్టు గెలుచుకున్నాయి. కబడ్డీలో మొదటి స్థానంలో పినిరెడ్డి గూడెం, ద్వితీయ స్థానంలో గుంపెల్లగూడెం జట్లు నిలిచా యని ఎస్సై బాదావత్ రవి నాయక్ తెలిపారు. కార్యక్రమం లో ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్, ఏఎస్సై నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ నాయకులు గంగావత్ లక్ష్మణ్ నాయక్, ఆలయ కమిటీ చైర్మెన్ కస్నా నాయక్, తదితరులు పాల్గొన్నారు.