Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దంతాలపల్లి
మండలంలోని పెద్దముప్పారం, దాట్ల, నిదానపురం, తదితర గ్రామాల్లో బతుకమ్మ తల్లి విగ్రహాలను ఆయా గ్రామాల సర్పంచ్‌లు హిమ, కొమ్మినేని రవీందర్, పెండ్యాల నరేష్ ఆవిష్కరించారు, అనంతరం సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తంగేడు, గునుగు, చామంతి, బంతి, గునుగు, గులాబీ, తదితర పూలతో త్రికోణాకారంలో తీర్చిదిద్దిన బతుకమ్మలను ఒకచోట ఉంచి పండుగ చేశారు. వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను సర్వాంగా సుందరంగా అలంకరించి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మలను గ్రామ శివారులోని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మెన్ నూకల వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు మాట్లాడారు. బతుకమ్మ వేడుకలు ప్రజల్లో సమైఖ్యత, పరస్పర సహకారం, మానసిక విలువలు, వికాసాన్ని పెంచుతాయని తెలిపారు. తెలంగాణ పండుగల విశిష్టతను భావితరాలకు అందిస్తూ సంస్కతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.