Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కిక్కిరిసిన బతుకమ్మకుంట బాణాపురం గ్రౌండ్
అ జనసంద్రంగా మారిన రోడ్లు
అ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు
నవతెలంగాణ-జనగామ
బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఎంగిలి పూలతో ప్రారంభమైన బతుకమ్మ సద్దుల బతుకమ్మ రోజు జనగామ పట్టణం లోని బతుకమ్మ చెరువు తో పాటు బాణాపురం రంగప్ప చెరువు వద్ద మహిళలు భారీగా తరలివచ్చి సద్దుల బతుకమ్మ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. అలాగే ధర్మకంచ గొర్ల గడ్డ ఢిల్లీ గడ్డ, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక మున్సిపాలిటీ తోపాటు రెవెన్యూ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టణంలో మహిళలకు ఇబ్బందులు కలవ కుండా వీధి లైట్లు ఏర్పాటు చేశారు.
ఆడపడుచులు సుభిక్షంగా ఉండాలి : ఎమ్మెల్యే
బతుకమ్మ పండుగ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బతుకమ్మకుంటలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. బాణాపురం రంగప్ప చెరువు వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆడపడుచులతోపాటు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మున్సిపల్ చైర్పర్సన్ జమున లింగయ్య కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ సిద్ధులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మల్హర్రావు : తెలంగాణ సంస్కతికి, సంప్రదాయాలకు ప్రతిక బతుకమ్మ పండుగ అని ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు అన్నారు. గురువారం సద్దుల బతుకమ్మ సంబురాల్లో ఎంపీపీ పాల్గొని మాట్లాడారు.
నర్మెట్ట : మండల కేంద్రంతో పాటు మచ్చుపహాడ్ గ్రామంలో బుధవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగ నిర్వహించారు.
గణపురం : మండలం లోని 16 గ్రామ పంచాయతీల్లో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సర్పంచులు బతుకమ్మ ఏర్పాట్లను భారీగా ఏర్పాటుచేయడంతో పెద్ద ఎత్తున బతుకమ్మలో మహిళలు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా బతుకమ్మ ఆట ప్రాంతంలో ఏర్పాట్లు చేశారు. ఎస్సై గుర్రం ఉదరు కిరణ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాటారం : మండలంలోని అన్ని గ్రామాలలో గురువారం సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సవాల నడుమ జరుపుకున్నారు. బతుకమ్మ కోసం విద్యుద్దీపాలు, డిజె సౌండ్స్ ఏర్పాట్లను గ్రామాల సర్పంచులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.
చిల్పూర్: సద్దుల బతుకమ్మ వేడుకలను గురువారం మండల కేంద్రంలో కన్నుల పండుగగా జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలు పండగకు దూరమైన ఆడపడుచులు అంతా ఒకే వద్ద చేరి బతుకమ్మ వేడుకల్లో లో ఆడిపాడుతూ ఆనందంగా పాల్గొన్నారు. ఎస్సై మహేందర్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మహాదేవపూర్ : మండల కేంద్రంతో పాటు కాళేశ్వరం, సూరారం అంబటి పల్లి, రాపల్లికోట, బొమ్మపూర్, ఎల్కేశ్వరం, అన్నారం, పలుగుల మద్దులపల్లి, కుదురుపల్లి, తదితర గ్రామాల్లో గురువారం సద్దుల బతుకమ్మ పండుగను మహి ళలు ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. సర్పంచులు తగిన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ కిరణ్ ఆధ్వర్యంలో మహాదేవపూర్, కాళేశ్వరం ఎస్సైలు రాజ్‌కుమార్, సాయి ప్రసన్నకుమార్ పర్యవేక్షించారు.
కొడకండ్ల : సద్దుల బతుకమ్మ వేడుకలను గురువారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల వద్ద వీధి దీపాలు అలంకరించారు. ఎస్సై ఎల్ పవన్‌కుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.