Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మహాదేవపూర్ మండల కేంద్రంలో సర్వేనెంబర్ 600లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా చేపడుతున్న సంతోషం తిరుపతి ఇంటి నిర్మాణాన్ని రెవెన్యూ సిబ్బంది గురువారం అడ్డుకుని గ్రామ పంచాయతీకి అప్పజెప్పినట్టు తాసిల్ధార్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఎవరు లేని సమయంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు సమాచారం రావడంతో రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని నిర్మాణం అడ్డుకొని గురువారం నిర్మాణ సంబందిత సిమెంట్ బస్తాలు, ఇసుకను స్వాధీనం చేసుకొని గ్రామ పంచాయతీకి తరలించినట్టు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎలాంటి అక్రమ కట్టడాలు చేపట్టొద్దని నోటీసు ఇచ్చినప్పటికీ అక్రమ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు అలాంటి వాటిని అడ్డుకుని చర్యలు తీసుకుంటామన్నారు.