Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
ఈ నెల 13న నవ తెలంగాణ దినపత్రికలో ప్రచు రితమైన 'వరదల్లో కొట్టుకుపో యిన తాడిచెర్ల స్మశాన వాటిక' అనే కథనానికి అధికారులు స్పందించారు. గురువారం ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు, పంచాయతీ రాజ్‌శాఖ ఏఈ అశోక్, కార్యదర్శి సత్యనారాయణ తాడిచెర్ల మానేరు ఒడ్డున ప్రమాదకరమైన స్థలంలో ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మాణం చేపట్టిన స్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, డంపింగ్ యార్డ్‌లను పరిశీలించారు. వరద ముంపునకు గురై కొట్టుకుపోయిన స్మశానవాటిక పునాదులను పరి శీలించారు. గుత్తేదారు నాణ్యతా ప్రమాణాలు పాటిం చకపోవడమా, వరద ఉధృతి వల్ల వల్ల దెబ్బ తిన్నాయా అనే అంశాలపై ఆరా తీశారు. పల్లెప్రగతి అభివృద్ధి పనులు పంచాయతీ, ఉపాధి హామీ అధికారులు సంయుక్తంగా ప్రజాప్రతినిధులతో కలిసి చేపట్టాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎంపీపీతోపాటు పంచాయతీ అధికారులు పరిశీలనకు హాజరైనా ఈజీఎస్ అధికారులు డుమ్మా కొట్టడం గమనార్హం.