Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ఊరూరా.. వాడవాడన.. వీధి వీధిన ఇంటింటా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న బతుకమ్మ వేడుకలను మహిళలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ వేడుకలు పల్లెల నుంచి పట్టణాల వరకు ఘనంగా సాగాయి. ఆయా గ్రామాలలో సర్పంచ్‌లు ప్రత్యేక చోరువతో బతుకమ్మ వేడుకల ప్రదేశాల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దారి పొడువున రంగు రంగున విద్యుత్ దీపాలతో అలంకిరంచారు. చెరువులు, కాలువ వద్ద బతుకమ్మ నిమజ్జన చేసే కార్యక్రమం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మండలంలోని మహేశ్వరం, లక్నెపెల్లి, ముగ్దుపురం, గురిజాల, రామవరం, ఇటికాలపెల్లి, ముత్తోజిపేట, రాజుపేట, రాజపల్లె, పాత ముగ్దుపురం, భాంజీపేట, చంద్రయ్యపల్లె, దాసరిపెల్లి, కమ్మపెల్లి మాధన్నపేట, నాగుర్లపల్లె గ్రామాలతో పాటు పలు గ్రామాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి..
నర్సంపేట పట్టణంలోని అంగడి మైదానంలో బతుకమ్మ వేడుకల్లో సంబురాలు అంబరింటాయి. మున్సిపాలిటి పాలకవర్గం ఆధ్వర్యంలో అంగడి రోడ్డులో భారీ ఆర్చి, విద్యుత్ దీపాల ఏర్పాటు ఈ సారి ప్రత్యేకతను చాటింది. సర్వాపురం, ద్వారకపేట, వడ్డెర కాలనీ, వల్లబ్‌నగర్, కమలాపురంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ నిమజ్జనం వద్ద మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఏసీపీ ఫణీంద్ర, సీఐ కే.కరుణాసాగర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్, వైఎస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, కమిషనర్ విద్యాధర్, కౌన్సిలర్ల బృందం వేడుకలను పర్యవేక్షించారు. అంగడి మైదానంలో ఉత్తమ బతుకమ్మలను కమిటీ సభ్యులు ఎంపిక చేశారు. దసరా పండుగ రోజున ఉత్తమ బతుకమ్మలను తీసుకొచ్చిన మహిళలకు బహుమతులను అందజేయనున్నారు.
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
నవతెలంగాణ- హన్మకొండ
హన్మకొండలోని జితేందర్‌నగర్‌లో సీపీఐ(ఎం), డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు మంద సంపత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వేడుకల్లో మహిళలు ఘనంగా వేడుకలను నిర్వహించుకున్నారు.
నవతెలంగాణ-శాయంపేట
మండల పరిధిలోని గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలను గురువారం మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఆయా గ్రామాలలోని మైదానాలలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. అనంతరం సమీపంలోని చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఆయా గ్రామాల సర్పంచులు విద్యుద్దీపాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
గురువారం వరంగల్‌లోని తన స్వగహంలో మేయర్ గుండు సుధారాణి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కతికి ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆశ్రిత రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
నవతెలంగాణ-నడికూడ
చర్లపల్లి, వరికోల్, ముస్త్యాలపల్లి, నార్లాపూర్, రాయపర్తి గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు గ్రామ సర్పంచ్ల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మచ్చా అనసూర్య రవీందర్, సర్పంచులు చాడ తిరుపతిరెడ్డి, సాధు నిర్మల సమ్మిరెడ్డి, రావుల సరిత రాజిరెడ్డి, బొట్ల సంధ్య రవి, నీలా సమ్మయ్య, ప్రజా ప్రతినిధులు నాయకులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నవతెలంగాణ- కాజీపేట
కాజీపేట, సోమిడి, కడిపికొండ, తరాలపల్లి, బట్టుపల్లి, మడికొండ, దర్గా, మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానం, ఫాతిమా జంక్షన్ ,వడ్డేపల్లి చెరువు కట్ట ప్రాంతాలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. మహిళలు బతుకమ్మ పాటలతో కోలాటాలు ఆడుతూ ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఇబ్బందులు కలగకుండా కాజీపేట, మడికొండ పోలీసులు బతుకమ్మ ఆట స్థలాలలో బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పోలీసులు వాహనాలను దారి మళ్ళించి పంపించారు.
నవతెలంగాణ-గీసుగొండ
మండలంలోని 16వ డివిజన్ ధర్మారంలో కార్పొరేటర్ సుంకరి మౌనిక శివకుమార్‌ల ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ యామునా ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. అలాగే మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో బతుకమ్మ ఏర్పాట్లకు లైటింగ్, ఇతర సదుపాయాలను కల్పించారు. మండలంలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ రమేష్, జెడ్పీటీసీ సరోజన హరికష్ణతో పాటు చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, పార్టీ అధ్యక్షులు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు .
నవతెలంగాణ-వేలేరు
మండల కేంద్రంతో పాటుగా పీచర గుండ్లసాగర్, కమ్మరిపేట, కన్నారం, మద్దెలగూడెం, షోడశపల్లి, గొల్లకిష్టంపల్లి, శాలపల్లి తదితర గ్రామాలలో గురువారం సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మాధవరెడ్డితో పాటు ఆయాగ్రామాల సర్పంచులు ధర్మారెడ్డి, రవిందర్, రమేశ్, మోహన్, రాజేష్, పరమేశ్వరి, మల్లిక తదితర సర్పంచులు సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేసారు, వేలేరులో ఎస్సై వెంకటేశ్వర్ల అధ్వర్యంలో పొలీసులు మహిళలకు మాస్కులు పంచారు . కార్యక్రమాలలో మహిళలు, ప్రజాప్రతినిదులు, నాయకులు పాల్గొన్నారు.
నవ తెలంగాణ- హన్మకొండ
న్యూశాయంపేటలోని కోట చెరువు వద్ద గురువారం బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు తన సొంత ఖర్చుతో బతుకమ్మ విగ్రహానికి రంగులు వేయించాడు. అంతేకకుండా డీజే కూడా ఏర్పాటు చేసి మహిళలకు బతుకమ్మ ఆడటానికి ఉత్సాహం నింపాడు. ఈ సందర్భంగా పలువురు మహిళలు కార్పొరేటర్ రాజును అభినందించారు.
భద్రకాళి దేవాలయం ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ సతీమణి రేవతి వినరు భాస్కర్ పాల్గొన్నారు. ఊరూరా సద్దుల బతుకమ్మ వేడుకలు
నవతెలంగాణ-హసన్‌పర్తి
మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాలలోని చెరువు కట్టల సమీపంలో బతుకమ్మ ఏర్పాట్లు పూర్తి చేయగా పోలీసు నిఘా నీడలో భద్రతా నిర్వహించారు. హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు, కేయూ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి పర్యవేక్షణలో బతుకమ్మ వేడుకల వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. మోబైల్ పార్టీ పోలీసు సిబ్బందితో భద్రత చర్యలు చేపట్టారు. చెరువుల వద్ద బతుకమ్మలను వేసేందుకు సంబందిత గ్రామాల సానిటేషన్ సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి బతుకమ్మ వేడుకల వద్ద దొంగతనాల నివారణకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్, అధికారులు, పోలీసు సిబ్బంది, మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో సంబురంగా గడిపారు.