Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
పోడుభూములకు సంబంధించి అర్హులకు పట్టాలిచ్చేందుకు ఈనెలాఖరు నుంచి దరఖాస్తులు తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండలంలో బాలన్నగూడెం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పొదెం రాంబాబు ఆధ్వర్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పొడు భూములకు సంబంధించి అర్హులైన ఆదివాసీలకు, గిరిజనులకు పట్టాలిచ్చిన తర్వాత రైతుబంధు పథకం కూడా వర్తించేలా ములుగు జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ సహకారం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మెన్ తోట రమేష్, నాయకులు గుండేటి రాజుయాదవ్, అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ, నాయకులు నర్రా శ్రీధర్, సిద్దంశెట్టి లక్ష్మణ్‌రావు, అచ్చ సత్యనారాయణ, సింగరిబోయిన నర్సయ్య, అమిలి చంద్రం, చిట్టిమల్ల సమ్మయ్య, పోలిన హరిబాబు, కోడం సత్యనారాయణ, పాయం బాబు, యర్రంశెట్టి రామకష్ణ, కోరం సంతోష్, గాదె శ్రీనివాస్‌చారి, శానం నరేందర్, కుదురుపాక చిట్టిబాబు, గోస్కుల లక్ష్మీ, గుమ్మల కృష్ణవేణి, గుమ్మల వీరస్వామి, యాసం హరీష్ పాల్గొన్నారు.