Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-రఘునాథ్‌పల్లి
నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట వేయొ చ్చని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఏసీపీ రఘుచందర్ అన్నారు. అసాంఘిక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మండల కేంద్రంలో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, సరైన వాహన పత్రాలు లేని 34 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ రఘుచందర్ మాట్లాడారు. సీసీ కెమెరా ఉన్న చోట దొంగతనాలు, ఇతర నేరాలకు అవకాశం లేదన్నారు. మండలం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి ఉండడంతో ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని వీధుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో వ్యాపారస్తులు, మండల ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. గంజాయి, గుట్కా, తదితర ప్రభుత్వ నిషేధిత సరుకులను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ విజరు కుమార్, ఎస్సైలు రాజేష్ నాయక్, తిరుపతి, రమేష్ నాయక్, ఎంపీటీసీ పేర్ని ఉష రవి, సర్పంచ్ల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.