Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ మండల కన్వీనర్ జిల్లా రమేశ్
నవతెలంగాణ-పర్వతగిరి
జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటామని సీఐటీయూ మండల కన్వీనర్ జిల్లా రమేశ్ తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 16న రాయపర్తి మండలం మైలారంలోని శ్రీ వెంకటేశ్వర పెట్రోల్ బంకులో మోసం జరుగుతోందని వార్తలు రాసిన జర్నలిస్టుపై శనివారం దాడికి పాల్పడ్డారని ఆన తెలిపారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉన్నది ఉన్నట్టుగా రాస్తే నేరమా అని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టులకు సీఐటీయూ అండగా ఉంటుందన్నారు. అక్షరాలతో ప్రజలను చైతన్య పరిచే విలేకరులపై దాడులు చేయడం సమంజసం కాదన్నారు. వెంటనే బంకు యాజమాన్యంపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.