Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడకండ్ల
ఈ నెల 31న హైదరాబాద్లో నిర్వహించే ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆదివారం స్థానిక మాల కమిటీ భవన్లో వాల్పోస్టర్ ఆవిష్కరించారు. మాల మహానాడు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల గౌరవాధ్యక్షుడు జక్కుల ప్రభాకర్ మాట్లాడారు. ఈనెల 31న హైదరాబాదులో 16 ప్లీనరీ వార్షికోత్సవ సభ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మండలంలోని మాల కులస్తులు అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు దేవదానం, సంజీవ, జ్ఞానానందం, నరసయ్య, దేవయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.