Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీసీపీ శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని జనగామ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు ఆదివారం దర్దేపల్లిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్తో కలిసి ఆయన మాట్లాడారు. గ్రామాల్లో శాంతియుత వాతా వరణం నెలకొల్పేందుకు యువత ముం దుకురావాలన్నారు. యువత సన్మార్గంలో ప్రయా ణించినప్పుడే సమాజం అభివద్ధి చెందుతుందన్నారు. యువత అసాంఘిక కార్య కలాపాలకు బానిస కాకూడదని సూచించారు. నిషేధిత వస్తువులు గుట్కాలు, గంజాయి, నాటుసారా లాంటివి విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల సప్లై తదితర వాటిని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. దొంగతనాల నివారణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశా మన్నారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వాహనాదారులు పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 30ద్విచక్ర వాహనాలతో పాటు ఐదు ఆటోలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇమ్మడి ప్రకాష్, ఎంపీటీసీ మంద వీరలక్ష్మి సోమయ్య, పాలకుర్తి సీఐలు సదన్ కుమార్, చేరాలు, ఎస్సైలు రామారావు, బండారి రాజు, పవన్ కుమార్, రాజు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.