Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సభ్యుడు దొంతి
కాంగ్రెస్‌లో చేరికలు
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గడీల పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని పెద్దకొర్పోలులో ఆదివారం వివిధ పక్షాల, సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు అధిక ప్రాధాన్య మిస్తామన్నారు. సీఎం కేసీఆర్ హామీలతోనే కాలం వెళ్లిదీస్తూ ఎన్నికల్లో ప్రజలను మాయ చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్దకొర్పోలు గ్రామశాఖ అధ్యక్షులు గై లక్ష్మణ్ ఆధ్వర్యంలో చేరాలు, ఐలయ్య, అశోక్, వెంకన్న, కట్టయ్య, శంకర్, రవిలతోపాటు మరో 50 కుటుంబాలకు చెందినవారు కాంగ్రెస్ పార్టీలో చేశారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అశోక్, జిల్లా కార్యదర్శి హరీష్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు హరిప్రసాద్, నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్, రవి, బిక్షపతి, కొమురారెడ్డి, సుబ్బారెడ్డి, శివకుమార్, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.