Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి, వంద శాతం లక్ష్యం పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దసరా పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు స్వల్ప విరామం ఇచ్చినట్లు తెలిపారు. తిరిగి ఈ ప్రక్రియ నేటి (సోమవారం) నుంచి చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేయుటకు మండల ప్రత్యేకాధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది కార్యాచరణ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. నేటికీ వ్యాక్సిన్ తీసుకొని వారిని గుర్తించి, వెంటనే వారికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేందుకు ప్రతిఒక్కరూ తమ వంతు కషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటుచేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల వారీగా ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకొని వారిని గుర్తించి, వ్యాక్సినేషన్‌కు చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ పట్ల విముఖత ఉన్నవారికి వ్యాక్సిన్ వల్ల ప్రయోజనాలు తెలిపి, వారు వ్యాక్సిన్ వేయించుకునేలా చైతన్యం చేయాలన్నారు. వద్ధులు, గర్భిణులు, బాలింతలు నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న మాస్కులు, భౌతిక దూరం పాటించాలన్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా వస్తే, ప్రాణాపాయం ఉండదన్నారు. మన శరీరం వ్యాక్సిన్‌తో రోగ నిరోధక శక్తిని కల్గివున్నందున త్వరగా కొలుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఏ మహేందర్, డీఆర్డీఓ జీ రాంరెడ్డి, డీపీఓ కే రంగాచారి, జనగామ, స్టేషన్ ఘనపూర్ ఆర్డీఓలు మధుమోహన్, కష్ణవేణి, మండల ప్రత్యేక అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు.