Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
'భూస్వామ్య, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా శ్రమ జీవుల పక్షాన పోరాడిన మహానీయుడు కామ్రేడ్ మద్దికాయల ఓంకార్' అని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి గాధగోని రవి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు పనాస ప్రసాద్ అధ్యక్షతన కామ్రేడ్ ఓంకార్ 13వ వర్థంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓంకార్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రజాప్రతినిధులు పేదల కోసం కాకుండా కార్పొరేట్ శక్తుల కోసం పాలనను కొనసాగిస్తూ ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నారని విమర్శించారు. పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఓంకార్ స్ఫూర్తితో బూర్జువా భూస్వామ్య దోపిడీ పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాంబయ్య, రాష్ట్ర నాయకులు మాలి బాబురావు, గోనె కుమారస్వామి, పెద్దాపూర్ రమేష్, ఎన్ రెడ్డి హంసారెడ్డి, వంగల రాగసుధ, చంద్రయ్య, గడ్డం నాగార్జున పాల్గొన్నారు.