Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ముదిరాజ్ కులస్తులు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, ఇతర అన్ని రంగాల్లో రాణించాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ఆకాంక్షించారు. మహాసభ 100వ ఆవిర్భావం సందర్భంగా జిల్లా కేంద్రంలో వ్యవస్థాపకులు కొరవి కృష్ణ స్వామి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సౌడ ముత్తయ్య చిత్రపటాలకు ఆదివారం పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం సుభాష్ మాట్లాడారు. మహాసభను స్థాపించి 100 ఏండ్లు పూర్తైందని చెప్పారు. వ్యవస్థాపకుడు కృష్ణ స్వామి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ముత్తయ్య ముదిరాజ్ మహాసభ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. కులస్తుల ఐక్యతతోపాటు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఎదగడానికి పాటుపడ్డారని చెప్పారు. అనంతరం కుల పెద్దలను దుశ్శాలువాతో సన్మానించారు. సమావేశంలో మహాసభ పట్టణ అధ్యక్షుడు ఆకుల సాంబయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బండి మల్లయ్య, జిల్లా నాయకులు గుండ్ల శంకర్, కొలెపాక మల్లయ్య, పర్సవేణి కుమారస్వామి, అల్లం రాజయ్య, రవి, యాదగిరి, ఘన్పూర్ మండల అధ్యక్షుడు అల్లం స్వామి, అనిల్, తదితరులు పాల్గొన్నారు.