Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి అశోక్
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు సామాజికంగా ఎదగాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్ కోరారు. తద్వారానే సమాజంలో సముచిత స్థానాన్ని పొందగలమని ఆయన స్పష్టం చేశారు. డివిజన్ కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి గౌరీశంకర్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మూడో కార్యవర్గ సమావేశానికి అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్య వైశ్యులు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మానవత్వాన్ని, దాతృత్వాన్ని చాటుతున్నారని తెలిపారు. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవకులుగా నిలుస్తున్నారని చెప్పారు. ఆర్యవైశ్యుల ఐక్యతను చాటేలా తెలంగాణ మహాసభ మర్రిచెట్టులా ఎదిగి కుల బాంధవులకు, పేద ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తోందని కొనియాడారు. తొలుత వాసవి మాత చిత్రపటానికి అతిథులు పూలమాలలు అలంకరించి ప్రార్థన గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి చీదర వీరన్న, కోశాధికారి పువ్వాడ హరిప్రసాద్, నాయకుడు ప్రతాపని పాండురంగయ్య, బిజ్జాల వెంకటరమణ, వజినేపల్లి దీప, గెల్లి ఇందిర, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మచ్చ సోమయ్య, కోశాధికారి వనమాల సురేష్, తొర్రూరు మండల అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి రేగురి వెంకన్న, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బీజాల అనిల్, తొర్రూర్ కిరానా మర్చంట్ వెల్ఫేర్ అధ్యక్షుడు ఇమ్మడి రాంబాబు, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.