Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మండలంలోని సూరారం గ్రామంలోని హైస్కూల్ ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులు శనివారం హఠాన్మరణం చెందారు. ఉదయం ఇంటి వద్ద బాత్రూంలో ఆయన కాలుజారి పడి తీవ్ర గాయాలపాలు కాగా కుటుంబీకులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సాయంత్రం మృతి చెందాడు. ఆయన మృతి పట్ల సూరారం ఎస్సీ కాలనీ హైస్కూల్ హెచ్ఎం లచ్చిరెడ్డి, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మొండయ్య, బొమ్మాపూర్ హైస్కూల్ హెచ్ఎం శంకరయ్య, సూరారం హైస్కూల్ ఉపాధ్యాయులు గోపి కష్ణ, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సూరం మహేష్‌రెడ్డి, ఎమ్మార్పీ సిబ్బంది రాజు, సీఆర్పీ రాజయ్య సంతాపం వెలిబుచ్చారు. ఆదివారం ఆంజనేయులు ఆంత్యక్రియలు నిర్వహించగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాయకులు హాజరై నివాళ్లర్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.