Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
పెట్రోల్ బంకుల్లో అక్రమాలను అరికట్టాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పసుల వినరుకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని టేకుమట్ల రోడ్డులోని సువర్ణ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద తనకు 20 లీటర్లకు బదులు 17 లీటర్లు మాత్రమే పెట్రోల్ పోశారంటూ మండలంలోని నైన్పాక గ్రామానికి చెందిన కిరాణ షాపు యజమాని శ్రీనివాస్ ఆదివారం ఆందోళనకు దిగాడు. ఈ సందర్భంగా వినరుకుమార్ ఆధ్వర్యంలో అక్కడకు చేరుకుని మాట్లాడారు. కిరాణ షాపు యజమాని శ్రీనివాస్ 20 లీటర్ల పెట్రోల్ పోయించుకోగా కేవలం 17 లీటర్లు మాత్రమే రావడం అక్రమాలకు అద్దం పడుతోందని చెప్పారు. ఈ క్రమంలో పెట్రోల్ బంక్ యాజమాన్యం స్పందించింది. ఐదు లీటర్ల పావుతో కొలిచి 20 లీటర్ల పెట్రోల్ పోసి కిరాణా షాప్ యజమాని శ్రీనివాస్‌ను సముదాయించి పంపించారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి పెట్రోల్ బంక్‌ల్లో అక్రమాలకు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినరుకుమార్ డిమాండ్ చేశారు.