Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
విష్ణుపురి వాటర్ ట్యాంక్ వద్ద గల శ్రీస్వామి వివేకానంద గహనిర్మాణ కార్మిక సంఘం కాజీపేట డివిజన్ కమిటీ కార్యాలయాన్ని సోమవారం సంఘం గౌరవాధ్యక్షుడు ఇమ్మడి బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు కందుకూరి రాజయ్య అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 13 గ్రామాలకు సంబంధించిన అసంఘటిత కార్మికులకు అడ్డాగా, గత 25 సంవత్సరాలుగా పేరు పొందిన కాజీపేట అడ్డ వద్ద నేటి వరకు కార్యాలయం లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు తెలు సారంగపాణి, బస్కే దశరధం, మాచర్ల భాస్కర్లింగస్వామి, సత్యం, రాజేందర్, రాజు, అయిలయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.