Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
సోమవారం జీడబ్య్లూఎంసీలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పలువురు బాధితులు తమ సమస్యలను అధికారులు పరిష్కరించటం లేదని ప్రశ్నించారు. కమిషనర్‌తో సహా కొంతమంది అధికారులు ప్రజావాణికి హాజరు కాక పోవడంతో బాధితులు కార్యాలయానికి వచ్చి వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రజావాణికి వచ్చిన వినతులను బల్దియా అదనపు కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్ స్వీకరించారు. ఒకటో డివిజన్ పైడిపల్లి నుండి ఆదర్శనగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం రోడ్డు పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని, ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదని, వెంటనే పనులు పూర్తి చేయాలని బాధితులు వినతిపత్రం అందజేశారు. 14వ డివిజన్ ఎన్టీఆర్నగర్ కాలనీలో గేట్వాల్ బిల్లా లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకునే పరిస్థితి ఉందని, అదేవిధంగా కాలనీలోని పలు ప్రాంతాల్లో టవర్ లైట్లు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ నగర్ అభివద్ధి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఈఈ రాజయ్య, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సిటీ ప్లానర్ వెంకన్న, డీఈ లక్ష్మారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.