Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
రైతులకు నకిలీ విత్తనాలను విక్రయించిన వారిపై కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి మదన్మోహన్ రావు డిమాండ్ చేశారు. గుండ్లపల్లిలో రైతులు నకిలీ వరి విత్తనాలు సాగు చేసి మోసపోయారు. వారు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో సోమవారం పంట క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెక్కొండలోని మన గ్రోమోర్ సెంటర్లో ఎన్టీయూ 1271 సన్నరకం సోన సీడ్ కంపెనీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులు సాగు చేశారన్నారు. అందులో కల్తీ విత్తనాలు రావడంతో కొంత భాగం దొడ్డు రకం, కొంత భాగం పొట్ట దశలో, కొంత భాగం వడ్లుగా మారీ ఐదారు రకాలుగా మరాయన్నారు. అధికారులు స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కంపెనీపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు తక్కల పల్లి మోహన్రావు, తాళ్లపల్లి వెంకటయ్య, తక్కలపల్లి భుజంగరావు, మనబోతుల లింగారెడ్డి, పటాన్ చంద పాల్గొన్నారు.