Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామెర
సోమవారం ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ కాయితాల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం సాధాసీదాగా కొనసాగింది. స్థానిక సర్పంచ్ శ్రీ రామ్ రెడ్డి గ్రామంలో నేటి వరకూ మిషన్ భగీరథ పైప్లైన్లు సక్రమంగా వేయలేదని తెలిపడంతో ఏఈ సీసీ రోడ్డు మూలంగా వేయలేదని, రోడ్డు పూర్తి అయిన తర్వాత తప్పకుండా వేస్తామని పేర్కొన్నారు. అనం తరం సర్పంచ్ ఐదేండ్లయినా పోలీసుస్టేషన్, మండల రెవెన్యూ భవనాల నిర్మాణం పూర్తికాలేదని ప్రశ్నించారు. ఎంపీపీ శంకర్, ఎంపీటీసీ రామకష్ణలు స్పందిస్తూ త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఎంఈఓ మాటా ్లడుతూ.. మండలంలో ప్రభుత్వ టీచర్లను సర్దుబాటు చేశామన్నారు. కోగిలవాయి సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి గ్రామంలోని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, . పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, పాఠశాలలో మరుగుదొడ్లు లేవని, వెంటనే నిర్మించాలని తెలిపారు.
వ్యవసాయ అధికారులు మండలంలో 55మందికి గానూ 53మందికి రైతు బీమా పథకం డబ్బులు చెల్లించినట్టు పేర్కొన్నారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు గురించి రైతులకు వివరించినట్టు తెలిపారు. హార్టికల్చర్ అధికారి మాట్లాడుతూ.. ప్రభుత్వం పామాయిల్ తో టలు పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని, దీనికి చాలా మంది రైతులు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో వివిధ శాఖల అధికారులు వారి యొక్క అభివద్ధి సమా చారాన్ని వివరించారు. చివరగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నుంచి అధిక నిధులను తీసుకువచ్చి మండలాన్ని అభివద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కల్పనా కష్ణమూర్తి, ఎంపీటీసీలు, .తహశీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ వెంక టేశ్వరరావు, ఎంపీఓ యాదగిరి పాల్గొన్నారు.