Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
18 నుంచి 35ఏండ్లు లోపు నిరుద్యోగులకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసి వారి ఆర్థిక అభివద్ధికి దోహదపడాలని జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఈ నెల 21వ నిర్వహించే నిరు ద్యోగులకు బ్యాంకు రుణ మేళా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీ, పాపులేషన్ వివరాలు సమగ్ర నివేదిక అందించాలన్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసే రుణాల గురించి సమగ్ర నివేదికలు ఉండాలన్నారు. రుణ మేళా ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నారు. గ్రామాల వారీగా, హ్యాబిటేషన్ వారీగా యువత వివరాల నివేదికలు అందించాలన్నారు. కమ్యూనిటీ వారీగా పూర్తి వివరాలు ఉండాలని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, ఎల్డీఎం ఆంజనేయులు, డీఆర్డీఏ పీడీ నాగ పద్మజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, బీసీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నిరుద్యోగులు ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కష్ణ ఆదిత్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న స్థానిక లీలాగార్డెన్స్లో నిర్వహించే రుణ మేళా, మిని జాబ్‌మేళాను ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చర్లపల్లి హైదరాబాద్ ఆధ్వర్యంలో కనీసం 8వ తరగతి, ఆపైన చదివిన బీసీ, ఎస్సీ మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారి సామాజిక బాధ్యతలో భాగంగా వెచ్చిస్తున్న నిధులతో ఈ ఉచిత శిక్షణ కోర్సులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం అర్హులైన వారికి పేరెన్నికగల ప్లాస్టిక్ పరిశ్రమ లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సత్వర న్యాయం జరిగేలా చూడాలి
ప్రజల సమస్యలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కలెక్టర్ కష్ణ ఆదిత్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి సందర్భంగా ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్యాం, ఆర్డీఓ రమాదేవి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.