Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
శ్రమించిన వారికి లక్ష్యం సాధ్యపడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అన్నారు. కమిషనరేట్ అధ్వర్యంలో డివిజన్ పరిధి లో ఎంపిక చేసిన యువతకు విద్యాజ్యోతి డిగ్రీ కాలే జీలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ శిక్షణా తరగ తులను సోమవారం జ్యోతిప్రజ్వలన చేసి ప్రారం భించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఆర్థికంగా వెనుకబడిన యువత రాణిం చాలనే లక్ష్యంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్వహించిన అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. డివిజన్ పరిధి ఎంపికైన 250 అభ్యర్థులకు 80రోజుల పాటు నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ అందజేస్తామన్నారు. త్వరలో పోలీస్ నియామా కాల ప్రకటన విడుదల అవుతుందనే దృష్టితో ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనంతరం శిక్షణకు హజరైన అభ్యర్థులకు నోట్ పుస్తకాలు, గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ రఘు చందర్, సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్ రెడ్డి, జనగాం రూరల్ సీఐ వినరు కుమార్, ఎస్సైలు రమేష్, శ్రీనివాస్, మహేందర్, విద్యాజ్యోతి ప్రిన్సిపల్ ఫాదర్ థామస్ కిరణ్, పి.జె.ఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.