Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్
అ ఎమ్మెల్యే రాజయ్య
అ ఎంపీ పసునూరి దయాకర్
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండాలని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, విశిష్ట అతిథి పసునూరి దయాకర్ అన్నారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని వ్యవ సాయ మార్కెట్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా మార్కెట్ అధికారి నాగేశ్వర శర్మ పాలకమండలి చైర్మెన్ గుజ్జరి రాజు, వైస్ చైర్మెన్ చల్లా చందర్ రెడ్డి, బత్తుల రాజన్‌బాబు, రంగు హరీష్, చల్లారపు శ్యాం సుందర్, పెంతల రాజ్ కుమార్, తాటికాయల వరుణ్, చిగురు సరితాంజనేయులు, జొన్నల సోమేశ్వర్, ఐత సుప్రియసంతోష్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యమని, రైతు ఆత్మహత్యలు నివారించేందుకు దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, మేధావులు,ప్రతిపక్షాల సలహలే కాకుండా, రైతులకు సాగుకు నిరంతర విద్యుత్ అందిస్తూ, సాదాబైనామా ద్వారా పాసుపుస్తకాలు అందిస్తున్నట్టు తెలిపారు. రైతు బంధు, రైతుబీమా, పంట సాగుకు రూ.10వేల సాయాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. దేశమే గర్వించదగ్గ పాలన సాగుతోందని, మిషన్ కాకతీయ పనుల ద్వారా 20వేల కోట్లవ్యయంతో 45 చెరువులు, కట్టలు, తూములు మరమ్మతులు చేపట్టి, ఒక్క చెేరువుకూడా వదలకుండా నీటిని ఒడిసిపట్టి చెర్లను నిండుకుండలా చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడెనిమిది ఏండ్లలో ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వమ న్నారు. రాష్ట్రంలో కరెంటు లేక రైతులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్న వేళ, స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలం చేసిన గొప్పనాయకుడు కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ అధికారి నాగేశ్వర్ శర్మ, కార్యదర్శి జీవన్ కుమార్, జడ్పీ స్టాన్డింగ్ కమిటీ ఛైర్మన్ మారపాక రవి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, గాంధీనాయక్, చిల్పూర్ దేవస్థాన చైర్మెన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, రడపాక సుదర్శన్, ఎంపీడీఓ కుమారస్వామి, జెడ్పీటీసీ ఇల్లందుల బేబీశ్రీను, అక్కనపల్లి బాలరాజు, మహేందర్ రెడ్డి, సర్పంచ్ సురేష్ కుమార్, మండల అధ్యక్షులు మాచర్ల గణేష్, రమేష్ నాయక్, ప్రసాద్ బాబు, లకావత్ చిరంజీవి, గుండె మల్లేష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చిల్పూర్ నుంచి ముగ్గురికి చోటు
చిల్పూర్ : స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకరం సోమవారం జరిగింది. చిల్పూర్ మండలం నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీలో ముగ్గురు చోటు సంపాదించుకున్నారు. వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా కార్యవర్గ బందం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీపతి పల్లి నుండి రంగు హరీష్, పల్లగుట్ట గ్రామానికి చెందిన శ్యామ్ కుమార్, చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన బత్తుల రాజన్ బాబు మాట్లాడుతూ... రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. తమకు బాధ్యతలు ఇచ్చినందుకు ఎమ్మెల్యే రాజయ్యకు, సహకరించిన మండల నాయ కులకు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీ సరిత బాలరాజు పాల్గొన్నారు.