Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నర్మెట్ట
రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని హనుమంతపూర్ గ్రామంలో సబ్ స్టేషన్ 33/11కేవీ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు రైతుబంధు రైతు బీమా లాంటి పథకాలను తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, జెడీ్ప కోఆప్షన్ మెంబర్ ఎండీ గౌస్, జెడ్పీటీసీ మాలోతు శ్రీనివాస్, టీిఆర్‌ఎస్ తరిగొప్పుల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేష్, వైస్ ఎంపీపీ ఆగిరెడ్డి, సర్పంచులు బానోతు రజిత రవి శంకర్‌నాయక్, పగడాల విజయ నరసయ్య, ఎస్సీ మల్లికార్జున్, సదానందం పాల్గొన్నారు.