Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్బెల్ట్
భూపాలపల్లి ఏరియా ఉత్పత్తి ఉత్పాదకత పై ఏరియా జనరల్ మేనేజర్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం భూపాల పల్లి పట్టణ కేంద్రంలోని జీఎం కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. కార్పొరేట్ టార్గెట్ కమిటీ పాల్గొని గనులలో మెరుగైన ఉత్పత్తి సాధనకు సలహాలు, సూచనలు చేశారు. గనులలో మాన్ పవర్, పని స్థలాలు, అవసరమైన యంత్ర సామాగ్రి గురించి చర్చించారు. వీలైనంత వరకు అన్ని వనరులను ఉపయోగించి ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని టాబ్లెట్ కమిటీ ఆదేశించారు. ఈ సమావేశంలో టార్గెట్ కమిటీ సభ్యులు కే నాగభూషణ్ రెడ్డి జీఎం(పీ అండ్ పీ), పి సత్తయ్య జీఎం(సీపీఅండ్పీ), రవి ఏజీఎం(ఐ ఈ కార్పొరేట్), ఏరియాలోని అన్ని గనుల మేనేజర్లు, ఏజెంట్లు, సర్వే అధికారులు, ఏరియా ఇంజనీర్లు పాల్గొన్నారు.