Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ళ ఆశయ్య
నవతెలంగాణ-దేవరుప్పుల
రాష్ట్రంలో 15 లక్షల మందికి పైగా రజకులు ఉన్నారని, రూ. 2వేల కోట్లతో రజక బంధు ఏర్పాటు చేయాలని రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ళ ఆశయ్య డిమాండ్ చేశారు. రజకవత్తిదారుల సంఘం 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రజక జెండాను ఆవిష్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో ఏర్పాటు చేసిన రజక వత్తిదారుల సంఘం ముఖ్య కార్యకర్తల విస్తత స్థాయి సమావేశంలో రెడ్డిరాజుల నారయణతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రజక వత్తిదారుల సంఘం ఏర్పడి 20 ఏండ్లు అయిందని ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి తెలంగాణ వరకు రజకుల పక్షనా అనేక ఉద్యమాలు చేసిందని అన్నారు. ప్రభుత్వం నుంచి రజకులకు సంక్షేమ పథకాలు, జీవోలను బడ్జెట్ సాధించినట్టు తెలిపారు. రాష్ట్రంలో రజకుల పై పెత్తందార్ల దాడులు దౌర్జన్యాలు, హత్యలు పెరిగిపోతు న్నాయన్నారు. వీటిని అరికట్టడానికి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా రజకులకు ప్రత్యేక సామాజిక రక్షణ చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. లాండ్రీ షాప్‌లకు ఉచిత విద్యుత్ పథకం పొందిన వారికి మెడ్రన్ లాండ్రీ షాపులకు రూ.2లక్షల రుణం రజక ఫెడరేషన్ నుంచి ఇవ్వాలన్నారు. సొంత ఇల్లు లేనివారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించివ్వాలని కోరారు. రజక సహకార సంఘాలన్నిటికి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు రెడ్డి రాజుల రమేష్, పాలకుర్తి మండల అధ్యక్షులు చిట్యాల సమ్మన్న, కార్యదర్శి మాదారం, జిల్లా ఉపాధ్యక్షులు మాడరాజు యాకయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు సింగారపు రమేష్, సీతారంపురం గ్రామ సర్పంచ్ రెడ్డిరాజుల రమేష్, దర్మపురం మాజీ ఎంపీటీసీ గండిపెల్లి యాకయ్య, కొండయ్య, యాకస్వామి పాల్గొన్నారు.