Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల భూముల వివాదంలో పోలీసులు అర్ధరాత్రి వేళ 10 మంది గిరిజన మహిళలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని సీపీఐ(ఎం) మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ సూర్నపు సోమయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాల మంజూరుకు, భూముల కేటాయింపునకు పార్టీ వ్యతిరేకం కాదన్నారు. కాగా గిరిజనులు మూడు తరాలుగా వ్యవ సాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను మెడికల్ కళాశాలకు కేటాయించ డం దారుణమన్నారు. 1952కు ముందు నుంచే గిరిజనులకు పట్టాలున్నాయని చెప్పారు. మెడికల్ కళాశాల ప్రతిపాదిత స్థలం చుట్టూ ఉన్న సంపన్నులను వదిలి