Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం తలపెట్టిన ఇంటర్వ్యూలను నిలిపేయాలని నాయకపోడు సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి సతీష్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పాయం కోటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 'షెడ్యుల్ ఏరియాలో చట్టాలను, జీఓలను ఉల్లంఘిస్తున్న కలెక్టర్ మాకొద్దు' అంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సతీష్, కోటేష్ మాట్లాడారు. జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వెలువడిన నోటిఫికేషన్లో నాన్ ట్రైబల్ అభ్యర్థులను షెడ్యుల్ ఏరియా జీఓలకు వ్యతిరేకంగా జనరల్ రిక్రూట్మెంట్ చేసే అర్హత కలెక్టర్‌కు లేదన్నారు. సుప్రీంకోర్టు ఎక్కడ కూడా హెల్త్‌లో షెడ్యుల్డ్ ప్రాంత ఉద్యోగాలపై ప్రస్తావన చేయలేదనే సాకుతో జిల్లా కలెక్టర్ దురుద్ధేశ్యంతోనే జీఓ నెంబర్ 3 కొట్టుడుపోయిందని, అందుకే వైద్య శాఖలో ఉద్యోగాలు ఆదివాసీలకు కేటాయించటం కుదరదని వాదిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి నేత మోకాళ్ల వెంకటేష్, నాయకులు రాకేష్, చంద తరుణ్, తదితరులు పాల్గొన్నారు.