Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ బి కిరణ్‌కు డాక్టరేట్ లభించినట్లు కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ డాక్టర్ కిరణ్ 'క్లాస్ ఇంబాలన్స్ రిడక్షన్ అండ్ ఆంట్ కాలనీ ఆప్టిమైజేషన్ బేస్డ్ ఫీచర్ సెలక్షన్ ఫర్ సాఫ్టువేర్ డిఫెక్ట్ ప్రిడిక్షన్' అంశంపై జేఎన్టీయూ హైదరాబాద్‌కు పరిశోదనా గ్రంథం సమర్పించాడని తెలిపారు. అతను పరిశోధనను సౌదీ అరేబియాలోని మజ్మా యూనివర్సిటీ ప్రొఫెసర్ జయదేవ్ జ్ఞాని, జేఎన్టీయూ హైదరాబాద్ ప్రొఫెసర్ నర్సింహ సంయుక్త పర్యవేక్షణలో పరిశోధనను పూర్తి చేసినట్లు వివరించారు. కిట్స్ కరస్పాండెంట్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కోశాధికారి నారాయణరెడ్డి కిరణ్‌కుమార్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఐటీ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ కామాక్షి, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాజనరేందర్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్‌రెడ్డి, స్టాఫ్ క్లబ్ ప్రెసిడెంట్, డీన్ ప్రొఫెసర్ నిరంజన్, అసొసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకరాచారి, తదితరులు పాల్గొన్నారు.