Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
సంక్షేమ గురుకుల పాఠశాలలను వెంటనే ప్రారంభించాలని టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు చాతళ్ల సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లు నడిపించేందుకు అనుమతించి హాస్టళ్లను తెరవకపోవడం వల్ల పేద విద్యార్థులు చదువులకు దూరమౌతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. గురుకులాలు తెరవకపోవడం వల్ల వివిధ కారణాలతో రాష్ట్రంలో సుమారు 85 మంది మృతి చెందారని తెలిపారు. గురుకులాలను ప్రారంభిస్తీ ప్రాణనష్టం జరిగేది కాదన్నారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున ఎక్స్గ్రెసియా చెల్లించాలని, వెంటనే గురుకులాలను తెరవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని, మరింత పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రుద్రారపు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి సింగాపురం అరవింద్, మహిళా వింగ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాచర్ల సుమలత, మెట్ల మౌనిక, అంబాల, శ్రీనివాస్, గొబ్బెట కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.