Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
పత్తి, మామిడి, జామ, నిమ్మ పంటల్లో అంతర పంటలు సాగు చేస్తే లాభాలొస్తాయని ప్రపంచ పర్యావరణ నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ప్రతినిధి హర్షశంకర్ తెలిపారు. మండలంలోని గంగిరేణిగూడెంలో పోతు కష్ణమూర్తి పత్తి పంటలో సాగు చేస్తున్న మామిడి పంట క్షేత్రాన్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్, ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం మారి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను మంగళవారం రైతులకు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హరిశంకర్ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. బీసీఓ ప్రాజెక్ట్ 2009 నుంచి అమలు చేస్తున్న పాజెక్టు కార్యక్రమాలను సమగ్ర సస్యరక్షణ పద్ధతుల నీటి సంరక్షణ పద్ధతులు, భూసార సంరక్షణ యజమాన్య పద్దతులు, నాణ్యత, సామాజిక పలు అంశాల గురించి వివరించారు. రైతులు జీవవైవిధ్యాన్ని పాటిస్తూ తరిగిపోయిన వనరులను గుర్తించి పునరుద్ధరించుకోవాలని సూచించారు. కోతకు గురైన ప్రాంతాల్లో ప్రాజెక్టు ఆధ్వర్యంలో మొక్కలను నాటుకోవాలని చెప్పారు. తద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పీయూ మేనేజర్ బత్తిని శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ రమేష్, క్షేత్ర సిబ్బంది ప్రశాంత్, రవిచందర్, రాంబాబు, తిరుపతి, గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.