Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఎంహెచ్ఓకు సీఐటీయూ వినతి
నవతెలంగాణ-ములుగు
అర్హులైన ఆశావర్కర్లను ఏఎన్ఎం పోస్టుల్లో నియమించాలని కోరుతూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ఆధ్వర్యంలోని బృందం మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్యను కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడారు. ప్రభుత్వం వివిధ శాఖల్లో పని చేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు కల్పిస్తున్న తరహాలోనే అర్హులైన ఆశావర్కర్లను ఏఎన్ఎంలుగా నియమించాలని కోరారు. ఆశావర్కర్లు నామమాత్రపు వేతనాలు తీసుకుంటూ 15 ఏండ్లుగా గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందిస్తూ శ్రమదోపిడీకి గురౌతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. మెడికల్ ఆఫీసర్, ఇతర పోస్టుల్లో కలిపిన విధంగా ఏడాదికి మూడు మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు రత్నం నీలాదేవి, నాయకులు సంధ్య, నాగమణి, సుధ, శ్రావణి, మాధవి, అనిత, సుజాత, రమణమ్మ, కవిత, సునీత, సరోజన, తదితరులున్నారు.