Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి గా మండలంలోని రాజుల కొత్తపల్లికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు గజ్జల వినోద్‌రెడ్డిని నియమించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పరిపాటి వెంకట్‌రెడ్డి మంగళవారం ఒక ప్రటకనలో తెలిపారు. వినోద్‌రెడ్డి 2001 నుండి పార్టీలో క్రియా శీలకంగా పని చేశారని పేర్కొన్నారు. మండల స్థాయిలో జరిగిన ఆందోళనలో ముందు నిలిచి పలు మార్లు జైలు పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న రాజుల కొత్తపల్లిలో టీఆర్ఎస్ను బలోపేతం చేసి స్థానిక ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా నిలవడంలో వినోద్‌రెడ్డి పాత్ర కీలకం. గతంలో శ్రీరామగిరి సహకార సంఘం అధ్యక్ష పదవిని పార్టీ గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు. రెండు సార్లు పార్టీ అనుబంధ యూత్ మండల అధ్యక్షుడుగా, పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఈ క్రమంలోనే ఆయన్ను నియ మించారు. వినోద్‌రెడ్డి రైతు సమితి గ్రామ కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ మాధవి నవీన్‌రావు, తదితరులకు వినోద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.