Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కురవి
ఉత్తర్ప్రదేశ్లో రైతుల ప్రాణాలు పోవడానికి కారకుడైన కేంద్ర మంత్రి అజరు మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఐ(ఎం) నేరడ కార్యదర్శి జంగం ఉపేందర్ డిమాండ్ చేశారు. మండలంలోని ఆ గ్రామంలో ఆ పార్టీ కమిటీ ఆద్వర్యంలో మంగళవారం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఉపేందర్ మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన నష్ట దాయక చట్టాలను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతుల మీదుగా కారును పోనివ్వడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో నాయకులు చల్లగొల్ల మల్లయ్య, కొండబత్తుల వెంకన్న, దుస్స వెంకన్న, రామన్న, గద్దల యాకయ్య, ఆంజనేయులు, మల్లయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.