Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దసరా సందర్భంగా రూ.94 లక్షల ఆదాయం
ఆర్టీసీ డీఎం కన్నం రమేష్
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూరు ఆర్టీసీ డిపో లాభాల బాటలో నడుస్తోందని ఆ డిపో మేనే జర్ కన్నం రమేష్ తెలిపారు. దసరా సందర్భంగా డిపోకు రూ.94 లక్షలు ఆదాయం సమకూరిందని ఆయన చెప్పారు. డిపోలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్ మాట్లాడారు. దసరా సందర్భంగా డిపో నుంచి హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్, నర్సంపేట, సూర్యపేటతోపాటు ముఖ్య పట్టణాలకు వారం రోజులపాటు 99 బస్సు సర్వీసు లను నడపగా రూ.94 లక్షలకుపైగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కిలో మీటర్‌కు రూ.42.83లు (88 శాతం ఆక్యుపెన్సీ)తో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. సోమవారం నాడు ఒక్క రోజే అత్యధి కంగా రూ.17.62 లక్షలు వచ్చినట్లు చెప్పారు. డిపో అభివద్ధికి కషి చేశారంటూ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని డీఎం అభినందించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌ఛార్జి బోయెజ్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.