Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఎంపికైన అభ్యర్థుల తాత్కాలిక జాబితాపై ఈనెల 25 వరకు అభ్యరతరాలు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య తెలిపారు. ఆయన కలెక్టరేట్లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఖాళీలను కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించేందుకు దరఖాస్తులను స్వీకరించిన క్రమంలో అభ్యంతరాలను స్వీకరించి మెరిట్ లిస్ట్ తయారు చేస్తామని చెప్పారు. ఈనెల 20, 21 తేదీల్లో చివరి దశ ఇంటర్వ్యూలు ఉంటాయని వివరించారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 20 నుంచి 25 వరకు సంబంధిత ధ్రువపత్రాలతో రాతపూర్వకంగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేయాలని కోరారు.