Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ట్రైబల్ వెల్ఫేర్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) దిలీప్‌కుమార్ కోరారు. మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల పోస్ట్ మెట్రిక్ బాలికల వసతిగహాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. వసతి గహాన్ని శుభ్రంగా ఉంచాలని, చెత్తాచెదారం లేకుండా చూడాలని చెప్పారు. అనుమతి లేకుండా ఔట్‌సోర్సింగ్‌లో ఎలా నియమించారని హెచ్డబ్ల్యూఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 నుంచి ఇప్పటివరకు ఇయర్ వైస్ స్టెంత్ లిస్ట్ ఇవ్వాలని చెప్పారు. ఏటా విద్యార్థులు తగ్గుతుండడానికి గల కారణాలను తెలపాలని ఆదేశించారు. కళాశాల అధ్యాపక బందంతో, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులు హాస్టల్లో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వంటల కోసం గ్యాస్ స్టౌలను వినియోగించాలని స్పష్టం చేశారు. అనంతరం వసతి గహ ఉద్యోగుల రిజిస్టర్‌ను పరిశీలించి పని విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లను, వాటర్ ప్లాంట్‌ను ప్రత్యక్షంగా పరిశీలించారు. పోస్ట్ మెట్రిక్ బాలుర హాస్టల్‌ను పరిశీలించి పాత భవనాలను కూల్చేందుకు సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తామన్నారు. ఆయన వెంట హెచ్డబ్ల్యూఓలున్నారు.