Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
నవతెలంగాణ-నడికూడ
గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని యూత్ కాంగ్రెస్ వరంగల్ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో మండల క్దేంరంలో టాటా ఏసీ ఆటోను తాళ్లతో లాగుతూ మండలం కేంద్రంలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరింత పెద్దఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల కన్వీనర్ కుమారస్వామి, సీనియర్ నాయకులు మల్హర్రావు, కొక్కిరాల దేవేందర్, నవీన్, దుప్పటి సదానందం, కొమ్ము రవి, భాషిక శ్రీనివాస్, మేకల రంజిత్, జీవన్రెడ్డిి, రావుల సురేష్, అశోక్, నవీన్, మధూకర్, వినరు, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.