Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్
నవతెలంగాణ-తొర్రూరు
సినీ నటుడు మంచు మోహన్‌బాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం అశోక్ మాట్లాడారు. మంచు విష్ణు 'మా' ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గొర్రెల కాపరులను అవమానపర్చేలా మోహన్ బాబు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. మోహన్ బాబు తక్షణమే గొర్రెల కాపరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాటేడు సర్పంచ్ వల్లపు శోభ యాకయ్య, జీఎంపీఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కొమ్మనబోయిన యాకయ్య, జిల్లా నాయకులు చెను రామకష్ణ, నూకల హరీష్, బొల్లం అనిల్, సురేష్, మురళి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
దంతాలపల్లి : సినీ నటుడు మంచు మోహన్‌బాబుపై చర్యలు తీసుకోవాలని జీఎంపీఎస్ మండల అధ్యక్షుడు ఉడుగుల అయిలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మోహన్‌బాబుపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడారు. ఫిర్యాదు చేసిన వారిలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఎర్రబోయిన మురళీ, నాయకులు ఉడుగుల యాకన్న, సందు లింగయ్య, జెనిగల సురేష్, మురళీ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.