Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అటవీ శాఖ అదుపులో వ్యక్తులు
నవతెలంగాణ-వెంకటాపురం
వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వణ్యప్రాణి మాంసాన్ని తరలిస్తున్నాడనే సమాచారం మేరకు అటవీ శాఖ సిబ్బంది దాడి చేసి మాంసంతో సహా వ్యక్తిని అదుపులోకి తీసుకుని అటవీ శాఖ కార్యాలయానికి మంగళవారం సాయం తరలించినట్టు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయ సమీపంలో వేరే మండలం నుంచి వచ్చి వ్యాపారం చేస్తున్న ఒకరు వణ్యప్రాణి మాంసాన్ని తరలిస్తున్నాడనే సమాచారం మేరకు బస్సును వెంబడించి సదరు వ్యాపారి వద్ద ప్లాస్టిక్ కవర్లో ఉన్న మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యాపారిని విచారించగా సమీపంలోని ఓ తినుబండారాల వ్యాపారి నుంచి మాంసాన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ విషయమై అటవీ శాఖ రేంజ్ అధికారి వంశీకష్ణను వివరాలు కోరగా మాంసం తరలిస్తున్న వ్యక్తితోపాటు మండల కేంద్రానికి చెందిన ఓ బెల్ట్ షాప్ నిర్వాహకుడి వద్ద మాంసం లభ్యమైందని చెప్పారు. ఆ ఇద్దరితో పాటు మరోకరిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. మాంసాన్ని హైదరాబాద్లోని పరీక్షా కేంద్రానికి తరలించి ఏ జంతువుకు మాంసమో గుర్తిస్తామని చెప్పారు. మాంసం ఎక్కడి నుంచి వారికి వచ్చిందనే అంశంపై విచారణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాగా మాంసంతో పట్టుపడ్డ వ్యక్తులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.