Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
మండలంలోని గాజులగట్టు గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తెలిపారు. ఆ గ్రామంలో మంగళవారం ఆయన తిరిగి ప్రజలను కలిసి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుడుంబా నివారణలో సహకరిస్తామంటూ గ్రామస్తులతో బొడ్రాయి వద్ద ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 25న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. గూడెం అభివృద్ధి కోసం 12 మందితో కమిటీ వేస్తామన్నారు. అలాగే పోడు భూములకు సంబంధించి అర్హులకు హక్కు పత్రాలిప్పిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఖాసీమ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వేం వెంకటకష్ణారెడ్డి, నాయకులు నూకల సురేందర్, సంపత్‌రావు, కటార్సింగ్, వేముల వెంకన్న, పెసరి శివ, మాజీ సర్పంచ్ సుమిత్ర వీరన్న, మంగీలాల్, తదితరులు పాల్గొన్నారు.
జగన్నాయకులగూడెంలోని సమస్యలు పరిష్కరిస్తా
జగన్నాయకులగూడెంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ హామీ ఇచ్చారు. గూడూరు పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌ను జగన్నాయకులగూడెంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ పెనుక రామ్మూర్తి, టీఆర్ఎస్ నాయకుడు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.