Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
ప్రయివేట్ హాస్టళ్ల నిర్వాహకులు విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని టాస్క్ఫోర్స్ ఏఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ కోరారు. హాస్టళ్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. భీమారంలోని శుభం ఫంక్షన్ హాల్లో ప్రయివేట్ హాస్టల్ నిర్వాహకులు, విద్యార్థులతో వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ప్రయివేట్ హాస్టల్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఏరుకొండ పవన్గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు హాస్టల్లో చేరేటప్పుడు ఆధార్, ఇతర వివరాలు తీసుకోవాలని సూచించారు. బయటి వ్యక్తులను హాస్టళ్లలోకి అనుమతించొద్దని స్పష్టం చేశారు. రాత్రి 8 గంటల తర్వాత హాస్టల్ నుంచి బయటకు వెళ్లడాన్ని, తిరిగి రావడాన్ని అనుమతించొద్దని చెప్పారు. విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా చూడడంతోపాటు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రయివేట్ హాస్టల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ మాట్లాడుతూ ప్రయివేట్ హాస్టళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు పోలీసులు పెట్రోలింగ్, నిఘా పెంచాలని కోరారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్, ప్రయివేట్ హాస్టల్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు కొల్గూరి సుగుణాకర్రెడ్డి, ఐలి చంద్రమోహన్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.