Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
అర్హులైన దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలివ్వాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గబ్బెట రాంకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్నేండ్లుగా రుణాలివ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు. సబ్సిడీని విడుదల చేయాలని కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఈనెల 21న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన మహాధర్నాకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.