Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి
పలు కుటుంబాలకు చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-తొర్రూరు
బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలో ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన మంగళవారం పరిహారం చెక్కులు అందించారు. మండలంలోని బోజ్యాతండాకు చెందిన మాలోత్ కమల, భూక్యా మైబూ కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున చెక్కులు అందజేశారు. అలాగే కంఠాయపాలెంకు చెందిన పోతర్ల సుజాత కుటుంబానికి రూ.4.50 లక్షల చెక్కులు అందించారు. అన్ని తరగతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసి మంగళపల్లి శ్రీనివాస్, బోజ్యాతండ సర్పంచ్ కాలునాయక్, కంఠాయపాలెం సర్పంచ్ శ్రీపాల్రెడ్డి, ఎంపీటీసీ దేవమ్మ, తదితరులు పాల్గొన్నారు.