Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి .డి శ్రీరాం అధ్యక్షతన ఎన్హెచ్ఎం తాత్కాలిక స్టాఫ్ నర్సుల నియామకానికి 1:2 పద్ధతిన ఇంటర్యూలు నిర్వహించారు. మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కలెక్టర్ ఆదేశానుసారం ఆర్డర్లు అందిస్తామని, నియామకమైన స్టాఫ్ నర్సులు అసంక్రమిత వ్యాధులు, చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ విభాగాల్లో విధులు నిర్వర్తించాలని డీఎంహెచ్ఓ శ్రీరాం తెలిపారు. స్థానిక అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తున్నామని, తుది నివేదిక కలెక్టర్ కు అందిస్తామని తెలిపారు. ప్రోగ్రాం అధికారులు ఉమాదేవి, డాక్టర్ గోపినాధ్, ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీమన్నారాయణ, సీనియర్ అసిస్టెంట్ శిరీష పాల్గొన్నారు.