Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
జాతీయ న్యాయ సేవాదికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర, ఉమ్మడి వరంగల్ సంస్ట ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని మల్లారం, చిన్నతూండ్ల, దుబ్బపేట గ్రామాల్లో సర్పంచ్ల అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులు ఉచిత న్యాయ సేవాధికార కార్యక్రమంపై ప్రజలకు అవగాహన నిర్వహించారు. న్యాయం దృష్టిలో అందరూ సమానులేనని అన్నారు. అందరికి సమాన అవకాశాలు కల్పించడానికి, పేద, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొనె పద్మ, పులిగంటి మమత నర్సయ్య, అజ్మీరా ప్రమీల పంచాయతీ కార్యదర్శులు రాము, సమ్మరాజు,ప్రవీణ్ వార్డు సభ్యులు, పాల్గొన్నారు.