Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీఎన్బీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ రాజ్‌కుమార్
నవతెలంగాణ-పాలకుర్తి
గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలతోపాటు బ్యాంకు ఖాతా దారులకు అందుబాటులో ఉండేలా మినీ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నామని పీఎన్బీ బ్యాంకు పాలకుర్తి బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ భూక్య రాజ్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని చెన్నూరు లో ఏర్పాటు చేసిన మినీ బ్యాంకు సేవా కేంద్రాన్ని చెన్నూరు, విసునూరు గ్రామాల సర్పంచులు పూస్కూరి పార్వతి రాజేశ్వరరావు,నకీర్త యాకయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మాటూరి చెన్నూరు ఎంపీటీసీ పూస్కూరి కళింగ రావు, పాలకుర్తి సొసైటీ వైస్ చైర్మన్ కారుపోతుల వేణు తో కలిసి ప్రారంభించారు. మినీ బ్యాంకు ద్వారా ప్రజలకు మెరుగైన బ్యాంకు సేవలు అందించేందుకు కషి చేయాలన్నారు. లావాదేవీలలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది నాగేశ్వర్ గ్రామస్తులు, వెంకటయ్య, రాములు, నాగరాజు యాకయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.