Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
ప్రతి విద్యార్థి ఉత్తమ పౌరులుగా ఎదిగి సమాజసేవలో భాగస్వా ములు కావాలని సీఐ ఎన్ కరుణాకర్ అన్నారు. బుధవారం స్థానిక పోలిస్స్టేషన్లో అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ, సమాజ సేవ అలవర్చుకోవాలన్నారు. రాష్ట్ర, దేశ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలిస్ స్టేషన్లోని వెపన్స్, వాటి పనితీరును విద్యార్థులకు వివరించారు. నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డయల్100కు ఆపదలో కాల్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీనుబాబు మాట్లాడుతూ ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి శాంతి భద్రతలను పరిరక్షించారన్నారు. వారి త్యాగాల ఫలితమే నేడు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామన్నారు. ఉపాధ్యాయురాలు రోజా, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, పాల్గొన్నారు.